TS: రాష్ట్రంలో కొత్తగా 710 కరోనా కేసులు

15 Jul, 2021 20:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి స్థిరంగా త‌గ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,34,605కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,101 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటలల్లో 808 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు