తెలంగాణలో కొత్తగా 1,707 కరోనా కేసులు

11 Jun, 2021 19:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,707 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 16 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,759 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,456 కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,74,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 158 కేసులు నమోదయ్యాయి.

చదవండి: కరోనా వచ్చినా జీతం కట్‌ .. పంచాయతీ కార్యదర్శుల ఆవేదన

మరిన్ని వార్తలు