శ్రీశైలంలో 9 గేట్ల ఎత్తివేత

14 Oct, 2022 02:06 IST|Sakshi

జూరాలకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్‌: జూరాల, శుంకేసుల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద తొమ్మిది గేట్లను ఎత్తారు. జూరాల స్పిల్‌వే ద్వారా 1,72,368 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 33,221, సుంకేసుల ద్వారా 1,21,185, హంద్రీ నుంచి 20,820 మొత్తం 3.47 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885.0 అడుగులుగా ఉంది. 215.8070 టీఎంసీలతో పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. తొమ్మిది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2.52లక్షలు, తెలంగాణ ఎడమగట్టు, ఏపీ కుడిగట్టు విద్యుత్‌ కోసం 66,151 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాలకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో 33 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు