ఫ్రీ అంబులెన్స్! మానవత్వం చాటుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగి

17 May, 2021 18:03 IST|Sakshi

హైదరాబాద్: కరోనా మహమ్మరి కాలంలో ఒకరి సహాయం చేయాలంటే చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో యుఎస్‌ఎ నుంచి తిరిగి వచ్చిన తరుణ్ కప్పాలా అనే ఎన్‌ఆర్‌ఐ యువ సాప్ట్ వేర్ మాత్రం ఒక కారును కొని దానిని ఆక్సిజన్ సదుపాయం గల అంబులెన్స్‌గా మార్చాడు. ఆ అంబులెన్స్‌ ద్వారా కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన రోగులను ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఆసుపత్రులకు తరలిస్తున్నాడు. అతను రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడమే కాక, అక్కడ వారికి ప్రవేశం లభించేలా కూడా చేస్తున్నాడు. తన స్నేహితుల్లో ఒకరి బందువు కోవిడ్ -19 వచ్చి మరణించిన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ర .34,000 వసూలు చేయడం చూసి తరుణ్ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాను అని పేర్కొన్నాడు. 

ఇటువంటి సమయంలో ప్రజల దగ్గర రూ.8,000 నుండి రూ.35,000 వసూలు చేస్తున్నారు. కరోనా రోగులను వేరే నగరాలు లేదా రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే ఇంకా ఎక్కువ మొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుంది అని అన్నాడు. అందుకే ఈ సేవలను ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. తరుణ్ ఒక వారంలోనే 20 మందికి పైగా కోవిడ్ -19 రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లి వారికి అక్కడ బెడ్ దొరికే వరకు ఉచితంగా కారులోనే ఆక్సిజన్ సహాయాన్ని అందించారు. అక్కడ ఆసుపత్రిలో అడ్మిషన్ ఫార్మాలిటీలు పూర్తయ్యే వరకు అతను ప్రతి రోగితో సమయాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. 

ఒక తల్లి అప్పటికే తన భర్త చనిపోయి, కొడుకు కోవిడ్-19 వల్ల ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన భర్త చూడటానికి వెళ్లడానికి ఎటువంటి సదుపాయం లేనప్పుడు మొదటి సారి తనను తీసుకెళ్లనని చెప్పాడు. తరుణ్ హైదరాబాద్ కు తిరిగి రాకముందు యుఎస్ఎలో డెలాయిట్, టిసీస్, అమెజాన్ వంటి సాప్ట్ వేర్ సంస్థల్లో పనిచేశాడు. ప్రస్తుతం నగరంలోని స్ప్రింగ్‌ఎంఎల్‌లో టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలోని తన స్నేహితులు ఎత్నే అనే సంస్థ నుంచి ఒక వ్యాన్ కొనడానికి డబ్బును సేకరించారని, ఇది కోవిడ్ -19 రోగులు లేదా మృతదేహాలను రవాణా చేయడంలో సహాయపడటానికి తాత్కాలిక అంబులెన్స్‌గా మార్చినట్లు ఆయన తెలిపారు. తన తల్లికి బ్రైన్ స్ట్రోక్ వచ్చి మూడు నెలలుగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు. తన ఇంట్లో లేని సమయాల్లో అమ్మను తన చెల్లి చూసుకుంటున్నట్లు చెప్పారు.

చదవండి:

కరోనాను జయించిన వందేళ్ల బామ్మ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు