నగదు పంపిణీలో నంబర్‌ వన్‌ 

21 Jan, 2021 09:00 IST|Sakshi

పీఎం కిసాన్‌ యోజన/రైతు బంధు బట్వాడాలో రికార్డు

పోస్టల్‌ మైక్రో ఏటీఎం విధానంతో రూ.190 కోట్ల పంపిణీ 

సాక్షి, హైదరాబాద్‌: రైతు ఇంటికే రైతుబంధును చేరవేయడం ద్వారా తెలంగాణ తపాలా సర్కిల్‌ రికార్డు సృష్టించింది. మైక్రో ఏటీఎంల ద్వారా ఎక్కువ మందికి నగదు పంపిణీ చేసి జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలిచింది. చదవండి: కేసీఆర్‌ను జైలులో పెట్టే దమ్ముందా?

రాష్ట్రవ్యాప్తంగా... 
‘తపాలా’ద్వారా ఇంటి వద్దే నగదు అందుకున్న రైతుల సంఖ్య: 3,01,000. ఇలా పంపిణీ చేసిన మొత్తం: రూ.190 కోట్లు. (ఇందులో రైతుబంధుతోపాటు పీఎం కిసాన్‌ యోజన లబ్ధి కూడా ఉంది) 

దేశవ్యాప్తంగా... 
‘తపాలా’ద్వారా ఇంటి వద్దే నగదు అందుకున్న రైతుల సంఖ్య: 26,40,000 
ఇందులో తెలంగాణ తపాలాశాఖ లావాదేవీల శాతం: 11.4 
జాతీయస్థాయిలో పంపిణీ చేసిన మొత్తం: రూ.910.6 కోట్లు 
ఇందులో తెలంగాణ తపాలాశాఖ బట్వాడా చేసిన శాతం: 21 

► తెలంగాణలోని 27 గ్రామీణ జిల్లాలతో ఉన్న హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో పంపిణీ అయిన మొత్తం: రూ.165.5 కోట్లు 

మధ్యస్థ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ.. 
రాష్ట్రాల జనాభా ఆధారంగా జాతీయ స్థాయిలో రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో తెలంగాణ మధ్యస్థ కేటగిరీలో ఉంది. తెలంగాణతోపాటు కేరళ, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్, అస్సాంలు అందులో ఉన్నాయి. ఈ కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇక పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలున్నాయి. అన్ని కేటగిరీలో కలిపి పరిశీలిస్తే.. పీఎం కిసాన్‌యోజన/రైతుబంధు లబ్ధి పంపిణీలో తెలంగాణ టాప్‌–5లో నిలిచింది.  

మరిన్ని వార్తలు