భద్రాచలం నుంచే నా పాదయాత్ర.. పార్టీ క్రమశిక్షణపైనా రేవంత్‌ రెడ్డి స్పందన

21 Jan, 2023 19:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో.. గాంధీభవన్‌లో శనివారం పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. అనంతరం పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టబోయే పాదయాత్రపైన ఆయన స్పష్టత ఇచ్చారు. 

ఈ నెల 26వ తేదీన పాదయాత్ర లాంఛనంగా ప్రారంభిస్తా. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుంది. భద్రాచలం నుంచే పాదయాత్ర మొదలుపెడతా. పాదయాత్రలో ప్రియాంక గాంధీ లేదంటే సోనియాగాంధీ ఒకరోజు పాదయాత్రలో పాల్గొనేలా తీర్మానం చేస్తున్నాం అని తెలిపారు. అంతేకాదు.. 

ఇక నుంచి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే హాజరైన సమావేశాలను గనుక నేతలు మూడుసార్లు రాకపోతే.. ఎందుకు రాలేదో వివరణ తీసుకుంటామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్‌ నేత నాగం జనార్థన్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని, ఈ అక్రమ కేసులపై తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు