వాట్సప్‌ చేస్తే ఉచిత భోజనం.. వారికి మాత్రమే!

6 May, 2021 21:49 IST|Sakshi
సేవా ఆహార్‌ పోస్టర్‌ విడుదల చేస్తున్న స్వాత్రిలక్రా, సంస్థల ప్రతినిధులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. ఒకవైపు కర్ఫ్యూ పకడ్బందీగా అమలుచేస్తూనే కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో​ భాగంగా మరో ముందడుగు వేసి కరోనా బాధితులకు అండగా నిలబడేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఆహారం కావాల్సిన కరోనా బాధితులు వాట్సప్‌లో మెసేజ్‌ చేస్తే చాలు. ఆ వివరాలు చదవండి.

సత్యసాయి సేవా సంస్థ, స్విగ్గీ, బిగ్‌ బాస్కెట్‌, హోప్‌ సంస్థలతో కలిసి తెలంగాణ పోలీసులు ‘సేవా భోజనం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైన కరోనా బాధితులు ఉదయం 7 గంటలలోపు 77996 16163 నంబర్‌కు వాట్సప్‌లో వివరాలు పంపించాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. వీరిలో చిన్నారులు, వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ పోలీస్‌ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని డీఐజీ స్వాతిలక్రా ఆయా సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కరోనా బాధితులకు సద్దుదేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్నియితే దుర్వినియోగం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

చదవండి: జొమాటో సంచలనం: నోయిడాలో అమల్లోకి..
చదవండి: ఒకే రోజు లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండు రాష్ట్రాలు
చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌
 

మరిన్ని వార్తలు