పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ట్రాన్స్‌జెండర్ల డిమాండ్‌ ఇవే!

19 May, 2022 13:19 IST|Sakshi

డీజీపీకి ట్రాన్స్‌జెండర్ల వినతి పత్రం 

సుప్రీం, హైకోర్టు తీర్పులు అమలు చేయాలి  

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు, పురుషులతో సమానంగా తమకూ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలీస్‌ శాఖ ఇన్‌వార్డులో వైజయంతి వసంత, ఓరుగంటి లైలా, చంద్రముఖి మువ్వల తదితరులు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసిన అన్ని విభాగాల్లోని పోస్టుల్లో తమకు ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని బుధవారం డీజీపీ కార్యాలయం వద్ద ట్రాన్స్‌జెండర్లు నిరసన చేపట్టారు.

అందరితో సమానంగా బతికే హక్కు ట్రాన్స్‌జెండర్లకు ఉందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులిచ్చిన తీర్పులను, 2021లో కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు 1% రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. బోర్డు విడుదల చేసిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని, దరఖాస్తు ఫారమ్‌లో స్త్రీ, పురుషులతో పాటుగా ట్రాన్స్‌జెండర్‌ ఆప్షన్‌ జోడించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు