ఇక సులువుగా పోలీస్‌ వెరిఫికేషన్‌

21 Apr, 2021 15:57 IST|Sakshi

ఆన్‌లైన్‌లో సేవలు ప్రారంభించిన డీజీపీ

‘ఐ–వెరిఫై’తో దరఖాస్తు చేసుకునే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికేషన్‌ (పీవీసీ), పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల (పీసీసీ)కు పోలీసు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్లు కావాలనుకున్న వారు నేరుగా ఆన్‌లైన్‌లో ఐ–వెరిఫై ద్వారా దరఖా స్తు చేసుకునే విధానాన్ని పోలీస్‌ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. www.tspolice.gov.inను క్లిక్‌ చేసి పోలీస్‌ వెరిఫికేషన్‌–క్లియరెన్స్‌ ఆప్షన్స్‌ ఎంచుకుని.. నిబంధనలను ఫాలో అయితే సరిపోతుంది. 

పోలీసు వెరిఫికేషన్‌
సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ శాఖ సంబంధ కార్యాలయాలు, అందులో అపాయింట్‌ అయ్యే ప్రైవేటు ఉద్యోగులు. ఆయా కార్యాలయాల్లో ఇతర సేవల కోసం పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు పోలీసు వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. 

పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌
విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వలస వెళ్లే పౌరులకు ఇది అవసరం. ఒకసారి దరఖాస్తు పూర్తి చేశాక పోలీసుల పని మొదలవుతుంది. దీనిపై సందేహాలుంటే హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించాలి.


ఇవీ లాభాలు.. 
► ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది.

► డాక్యుమెంట్ల దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపులు సులభతరంగా మారుతాయి. 

► ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లోని ఫొటోల ఆధారంగా నేరచరిత కలిగిన వారిని సులువుగా గుర్తించే వీలుంది.

► దరఖాస్తుల పరిశీలనకు అదనపు మానవ వనరుల వినియోగం తగ్గింపు. 

► దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకునే సదుపాయం దరఖాస్తుదారులకు కలుగుతుంది.   

మరిన్ని వార్తలు