గిరిజన హక్కులను కాపాడుదాం: కోదండరామ్‌

24 May, 2022 01:56 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ కోదండరాం 

పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌

సిరిసిల్లటౌన్‌: ఏళ్ల తరబడి పోడు భూముల్లో సాగు చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులు, గిరిజనేతరులకు అండగా నిలుస్తామని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో పోడు సాగుదారుల హక్కులపై సోమవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, వారి కి హక్కు పత్రాలివ్వడం సర్కారు బాధ్యత అని చెప్పారు.

అటవీ చట్టాలన్నీ ఆదివాసులు, గిరిజను లకు అనుకూలంగా ఉన్నా, వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగులో ఉన్న భూము లపై యాజమాన్య హక్కులు పొందడానికి రైతు లకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లా డుతూ.. జిల్లాలోని 20వేల ఎకరాల్లో గిరిజనులు, ఇతర నిరుపేదలు సాగు చేసుకుంటున్నారని, తద్వారా సుమారు 10వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ఆయా భూములపై యాజమాన్య హక్కులు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు