దశలవారీగా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం

14 Dec, 2022 01:12 IST|Sakshi

టీఎన్జీవోస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంత్రి పువ్వాడ 

ఖమ్మం సహకారనగర్‌: రాష్ట్రంలోని ఉద్యోగు­లకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్క­రించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఖమ్మంలో సోమవారం రాత్రి జరిగిన టీఎన్జీవోస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశా­నికి కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్య­దర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌ అధ్యక్షత వహించారు.

సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి అజయ్‌­కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్‌లు, 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల తీర్మానాలను వెల్లడించారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయడం­తో పాటు మూడు డీఏలు మంజూరు చేయాలని, ఉద్యోగు­లకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, 317 జీవోతో బదిలీపై వెళ్లిన భార్యాభర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు