చెప్పు పోయిందని ట్విట్టర్‌లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!

2 Apr, 2023 07:30 IST|Sakshi

సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్‌లో గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్‌ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్‌లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు.

దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్‌పూర్‌ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు