తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగరా

5 May, 2022 14:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికకు నగరా మోగింది. తెలంగాణ రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 19న నామినేషన్ల పరిశీలన, 30న పోలింగ్‌ నిర్వహించనున్నారు. బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనుంది.
చదవండి: భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్‌ కథా చిత్రమ్‌

మరిన్ని వార్తలు