పేదరికం తక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ

27 Nov, 2021 04:08 IST|Sakshi

దేశంలో 11వ స్థానం.. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

దారిద్య్ర రేఖకు అత్యంత దిగువన ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌

సాక్షి, హైదరాబాద్‌: పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 13.74 శాతం ప్రజలు విభిన్న కోణాల్లో (మల్టీడైమెన్షనల్లీ పూర్‌) పేదరికం అనుభవిస్తున్నట్లు 2015–16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4)లో తేలింది. ఈ సర్వే వివరాలను నీతి ఆయోగ్‌ శుక్రవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా విభిన్న కోణాల్లో దారిద్య్రానికి దిగువన ఉన్న జిల్లాల జాబితాను కూడా విడుదల చేసింది.

నిరుపేదలు అతితక్కువగా 0.71 శాతమే ఉన్న రాష్ట్రంగా మొదటి స్థానంలో కేరళ నిలిచింది. ఏపీ, కర్నాటక తరువాత 11 స్థానంలో తెలంగాణ ఉంది. నిరుపేదలు అధికంగా ఉన్న రాష్ట్రంగా (51.91 శాతం) బీహార్‌ నిలిచింది. సమతుల ఆహారం అందించే విషయంలో తెలంగాణ 13వ స్థానంలో నిలవగా, చిన్నారులు, కౌమార దశలో ఉన్నవారి ఆరోగ్యం విషయంలో ఏడోస్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు