నష్ట పరిహారం కోసం మిర్చి రైతుల ధర్నా

25 Dec, 2021 01:35 IST|Sakshi
వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు 

ఖమ్మం మయూరి సెంటర్‌: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించి ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ వ్యవసాయ కమిషనరేట్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడారు. అనంతరం వ్యవసాయ అడిషనల్‌ కమిషనర్‌ విజయకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. 

మరిన్ని వార్తలు