రోజుకు రూ. 30 కోట్ల పైమాటే..

18 Feb, 2022 03:12 IST|Sakshi

రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం

రేట్ల సవరణ అనంతరం 15 రోజుల్లోనే రూ.500 కోట్ల రాబడి

61 వేలు దాటిన డాక్యుమెంట్‌ లావాదేవీల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ల శాఖ కాసుల వర్షం కురిపిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయే తర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలు వలు పెరిగిన తర్వాత 15 రోజుల్లోనే ఆ శాఖ ఆదాయం అమాంతంగా పెరిగింది. ఈనెల ఒకటో తేదీ నుంచి తాజాగా గురువారంరాత్రి వరకు 61 వేలకుపైగా లావాదేవీలు జరగగా, రూ.502. 87 కోట్ల ఆదాయం సమకూరినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

అంటే, రోజుకు రూ.30 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోందన్న మాట. కేవలం వ్యవ సాయేతర భూములు, ఆస్తుల రిజి స్ట్రేషన్లకే ఈ ఆదాయం రాగా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు మరో రూ.100 కోట్లు వస్తాయని రెవెన్యూవర్గాలు భావి స్తున్నాయి. ఈ నెలలో మిగిలిన 15 రోజు లకు మరో రూ.500 కోట్లు వస్తాయని, మొత్తం కలిపి ఈ నెలలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఈ ఏడాది రూ.10 వేల కోట్లు
2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12 వేల కోట్ల ఆదాయం రాబట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, ఫిబ్రవరి 15 నాటికే రూ.10 వేల కోట్లు వచ్చాయని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్టాంపుల విక్రయంతో వచ్చిన ఆదాయం కలుపుకుంటే అది రూ.12 వేల కోట్లకు చేరిందని సమాచారం. గతేడాది జూలైలో ప్రభుత్వ విలువలను సవరించడం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు పెంచి నప్పటి నుంచే రిజిస్ట్రేషన్ల ఆదాయం పరుగులు పెడుతోంది.

తాజాగా ఫిబ్రవరి ఒకటిన ప్రభుత్వ విలువలను మరోసారి సవరించిన నేపథ్యంలో ఈ ఆదాయం మరింత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిలకడగా కొన సాగుతుండటం, క్రయవిక్రయ లావా దేవీలు నానాటికీ పెరుగుతుండ టమే ఇందుకు కారణమని, వచ్చే ఆర్థిక సంవ త్సరంలో ఒక్క రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆ శాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.   

మరిన్ని వార్తలు