కొత్తగా 147 కరోనా కేసులు 

26 Nov, 2021 04:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం 33,836 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 147 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,75,148కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.

కరోనాతో ఒక్కరోజులో ఒకరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,986కి చేరిందని తెలిపారు. ఒక్కరోజు వ్యవధిలో 148 మంది కోలుకోగా, మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,67,631కి చేరిందని వెల్లడించారు. బుధవారం రాష్ట్రంలో 83,053 మందికి మొదటి డోస్‌ కరోనా వ్యాక్సిన్‌ వేశారు. 99,053 మందికి రెండో డోస్‌ వేశారు.  

మరిన్ని వార్తలు