జూలై 1న ఆర్‌ఎంసీ సమావేశం

24 Jun, 2022 01:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యు దుత్పత్తితో పాటు కృష్ణాలో మిగులు జలాల వినియోగంపై చర్చించడానికి జూలై 1న జలసౌధలో రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తాజాగా లేఖ రాసింది. ఇప్పటికే రెండుసార్లు ఆర్‌ఎంసీ సమావేశం జరగగా, తెలంగాణ అధికారులు హాజరు కాలేదు.

అయినా రిజర్వాయర్ల నిర్వహణకు సంబం ధించిన ముసాయిదా రూల్‌కర్వ్‌ (విధివిధానాలు)పై ఈ సమావేశాల్లో కృష్ణాబోర్డు అధికారులు చర్చించారు.  1న జరగనున్న సమావేశంలో రూల్‌కర్వ్‌కు తుదిరూపమిచ్చి తదుపరి నిర్వహించే భేటీలో ఆమో దించాలని కృష్ణాబోర్డు యోచిస్తోంది. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని విడుదల చేసే అంశంపై  బోర్డు శుక్ర వారం నిర్ణయం తీసుకోనుంది.  

మరిన్ని వార్తలు