ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట.. గేర్‌ మార్చిన టీఎస్‌ఆర్టీసీ

2 May, 2022 15:53 IST|Sakshi

1,016 బస్సులకు తెలంగాణ ఆర్టీసీ టెండర్లు

తొలిసారి స్లీపర్‌ బస్సులు కొనబోతున్న ఆర్టీసీ

సాక్షి, హైదరాబాద్‌: డొక్కు బస్సులతో నత్తనడకన సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ గేర్‌ మార్చింది. కొత్త బస్సులు కొనే దిశగా వేగం పెంచింది. 1,016 కొత్త బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. తయారీదారులకు ఆ బస్సుల గురించిన వివరాలు అందించి కొటేషన్లు ఆహ్వానించింది. అవి విడతలవారీగా మరో నాలుగైదు నెలల్లో ఆర్టీసీ చెంతకు చేరనున్నాయి. కాలం చెల్లిన వాటితోపాటు డొక్కుగా మారిన బస్సులతోనే ఆర్టీసీ ఇంతకాలం నెట్టుకొస్తోంది. అయితే ఇటీవల కండీషన్‌ లేని బస్సుల వల్ల ప్రమాదాలు పెరగడంతో వాటిని తొలగించడానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వరసగా జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువగా అద్దె బస్సులే ఉంటున్నాయి. 

కొన్ని సొంత బస్సులు కూడా ప్రమాదాలకు కారణమవుతుండటాన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది. పది రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో కొత్త బస్సులు కొనే అంశాన్ని చర్చించారు. ఆ వెంటనే బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. కొత్త బస్సులను కొత్త ప్రాంతాలతోపాటు కొరత ఉన్న చోట తిప్పనున్నారు. కాగా, ఆర్టీసీ తొలిసారి స్లీపర్‌ బస్సులు కొనబోతోంది. ఇప్పుడు కొనేవాటిల్లో 16 ఏసీ స్లీపర్‌ బస్సులు ఉన్నట్టు ప్రకటించింది. (చదవండి: పడవతో గస‍్తీ..లేక్‌ పోలీసింగ్‌ వ్యవస్థ)

మరిన్ని వార్తలు