మూడోవారం నుంచి ‘పోడు’ దరఖాస్తులు 

13 Oct, 2021 02:03 IST|Sakshi

విధివిధానాలపై సీఎస్‌ సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: పోడు భూముల సాగుదా రుల నుంచి దరఖాస్తుల స్వీకరణకుగాను విధివిధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ నెల మూడోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినేట్స్‌ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై త్వరలో జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు