వచ్చేసిందోచ్‌: హైదరాబాద్‌ చేరిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌

1 May, 2021 18:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్‌ విమానాశ్రయానికి శనివారం సాయంత్రం వ్యాక్సిన్‌ కంటైనర్లు వచ్చాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్‌ఏసీ)కు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల మొదటి ప్రధాన కన్‌సైన్మెంట్ చేరుకుంది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఒక పెద్ద మైలురాయి.

ఈ వ్యాక్సిన్ సరుకును ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ విమానంలో దిగుమతి చేసుకుంది. ఈ విమానం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారీ ప్రదేశంగా హైదరాబాద్‌కున్న ప్రత్యేక స్థానం దృష్ట్యా, వ్యాక్సిన్ల సంఖ్యలో పెరుగుదలకు అనుగుణంగా జీహెచ్‌ఏసీ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. కొన్నేళ్లల్లో ఈ ప్రాంతం నుంచి 3.5 బిలియన్ల వివిధ రకాల కరోనా వ్యాక్సిన్‌ల మోతాదులు ఉత్పత్తి అవుతాయని అంచనా.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో చేరిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. వీటిని మైనస్ 20 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం జీహెచ్‌ఏసీ- డాక్టర్ రెడ్డీస్ సప్లై చైన్ బృందం, కస్టమ్స్ విభాగం, ఎయిర్ కార్గోకు చెందిన నిపుణులతో కలిసి పని చేస్తోంది. స్పుత్నిక్ వి కన్‌సైన్మెంట్‌ను సజావుగా నిర్వహించడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7.5 టన్నుల వ్యాక్సిన్‌ తెలంగాణకు చేరుకుంది. మొత్తం లక్షా 50 వేల డోసుల వ్యాక్సిన్‌ హైదరాబాద్‌ చేరింది.

చదవండి: ‘భారత్‌ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం
చదవండి: సంతలో లస్సీ ప్రాణం మీదకు వచ్చింది.. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు