Telangana: 23 నుంచి పది పరీక్షలు

22 May, 2022 02:26 IST|Sakshi

ఏర్పాట్లు పూర్తి చేసిన పాఠశాల విద్యా శాఖ 

హాజరుకానున్న 5,09,275 మంది విద్యార్థులు 

ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు 

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యా శాఖ ఏర్పాటు చేసింది. ఈ నెల 23 నుంచి జూన్‌ ఒకటి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 5,09,275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లను విద్యా శాఖ ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబా టులో ఉంచడంతో పాటు పాఠశాలలకు చేరవేసింది.

ప్రింటెడ్‌ నామినల్‌ రోల్స్‌ కూడా సంబంధిత పా ఠశాలలకు పంపామని స్పష్టం చేసింది. కరోనా వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలవడంతో  సిలబస్‌ను 70 శాతానికి కుదించి ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపింది. పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించామంది. జనరల్‌ సైన్స్‌ కేటగిరీలో మాత్రం ఫిజికల్‌ సైన్స్, బయో సైన్స్‌ ప్రశ్నాపత్రాలను వేరుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈసారి ప్రశ్నపత్రంలో చాయిస్‌లను ఎక్కువగా ఇచ్చామని వివరించింది. 

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ 
విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు చేరువలో ఉన్న పరీక్ష కేంద్రాలనే విద్యా శాఖ కేటాయించింది. పరీక్షల నిర్వహణకు 2,861 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు.. 2,861 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 33 వేల మంది ఇన్విజిలేటర్లను విధుల్లోకి తీసుకుంది. రాష్ట్ర కార్యాలయం నుంచి 4 ప్రత్యేక ఫ్లైయింగ్‌ స్వా్కడ్‌ బృందాలు, 144 ఫ్లైయింగ్‌ స్వా్కడ్‌ బృందాలను ఏర్పాటు చేసింది.

ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి పరీక్ష తీరును పరిశీలిస్తాయి. పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అదనంగా నడపాలని ఆర్టీసీ అధికారులను విద్యా శాఖ కోరింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తారు. పరీక్ష కేంద్రంలో సంబంధిత జి ల్లా, మండల విద్యాధికారుల ఫోన్‌ నంబర్లను ప్రద ర్శించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఉదయం 9.35 తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు.      

మరిన్ని వార్తలు