తెలంగాణ‌లో ఇంట‌ర్ టూ పీజీ ఆన్‌లైన్ విద్య‌

25 Aug, 2020 16:02 IST|Sakshi

పాఠ‌శాల నుంచి క‌ళాశాల దాకా అంతా ఆన్‌లైన్ బోధ‌నే

సాక్షి, హైద‌రాబాద్‌: సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి ఇంటర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు ప్రారంభం అవుతాయ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థుల‌కు కూడా అదే రోజు నుంచి ఆన్‌లైన్ బోధ‌న  ప్రారంభం అవుతుంద‌ని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా డిజిట‌ల్ బోధ‌న ఉంటుంద‌ని తెలిపారు. దీని కోసం అధ్యాప‌కులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ పూర్తి చేశామ‌ని తెలిపారు.

అధ్యాప‌కులు ఈ నెల‌ 27 నుంచే కళాశాలల‌కు వెళ్ళాల‌ని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న‌ రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. ఈ మేర‌కు విద్యాశాఖ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా వుండ‌గా వ‌చ్చే నెల 1 నుంచి పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. (చ‌ద‌వండి: ఓపెన్‌ విద్యార్థులందరూ పాస్‌)

(చ‌ద‌వండి: ఫస్ట్‌ నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు)

మరిన్ని వార్తలు