సింగరేణిలో సమ్మె సైరన్‌

30 Nov, 2021 01:29 IST|Sakshi
కలిసికట్టుగా కార్మిక సంఘాల నేతలు 

9, 10, 11 తేదీల్లో కార్మికుల నిరసన  

శ్రీరాంపూర్‌ (మంచిర్యాల): సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలను నిరసిస్తూ డిసెంబర్‌ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.

ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్‌లో 5 జా తీయ సంఘాలతోపాటు సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ నేతలు జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీబీజీకెస్‌ నేతలు ఇప్పటికే కొద్దిరోజుల కిందట సమ్మెనోటీసు ఇచ్చారు.  జేఏసీ  కూడా సింగరేణి యాజమా న్యానికి మంగళవారం మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామస్వామి తెలిపారు. కార్మిక నేతలు మొత్తం 9 డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు