నువ్వు లేకుండా మేం ఎలారా బతికేది?

20 Oct, 2021 05:05 IST|Sakshi

మలేసియా సముద్ర తీరంలో సూర్యాపేట వాసి గల్లంతు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  స్పందించాలని తల్లిదండ్రుల వినతి 

సూర్యాపేట క్రైం: మలేసియా సముద్రతీరంలో సూర్యాపేట యువకుడు రిషివర్ధన్‌రెడ్డి(21) గల్లంతయ్యారు. మోటకట్ట వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల కుమారుడు రిషివర్ధన్‌ మలే సియాలో సరుకుల రవాణా నౌకలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ప్రమాదవశాత్తూ కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. రిషి ఆచూకీ లభించలేదని, బుధవారం సాయంత్రంలోగా తెలుస్తుందని అధికారులు ఫోన్‌లో తెలిపారు. దీంతో బిడ్డ ఏమయ్యాడోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు వేడుకుంటున్నారు.

ఎలారా బతికేది? 
మూడ్రోజుల క్రితం ప్రేమగా మాట్లాడి మమ్మల్ని మురిపించావు. ఆ మాటల్ని ఇంకా మరువనే లేదు. అంతలోనే సముద్రంలో కొట్టుకుపోయావని చెప్తుంటే నమ్మలేకపోతున్నాం. నువ్వు లేకుండా మేం ఎలారా బతికేది? కన్నా.. మా కోసం నువ్వు బతికి రారా. 
– రిషివర్ధన్‌రెడ్డి తల్లిదండ్రులు  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు