మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు

9 Feb, 2021 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. మే 17 నుంచి  26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది.

పరీక్షల షెడ్యూల్‌ వివరాలు..

మే 17న తెలుగు 

మే 18న హిందీ 

మే 19న ఇంగ్లీష్‌ 

మే 20న మ్యాథ్స్‌  

మే 21న సైన్స్‌

మే 22న సోషల్‌ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.

మరిన్ని వార్తలు