కృష్ణా జలాల పరిరక్షణకు కోదండరాం యాత్ర

4 May, 2022 01:47 IST|Sakshi

కృష్ణా జలాల పరిరక్షణకు నడుం బిగించిన టీజేఎస్‌   

నల్లగొండ జిల్లాలో 150 కి.మీ. మేర కొనసాగనున్న యాత్ర 

సాక్షి, హైదరాబాద్‌ /సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కేంద్ర గెజిట్‌ను రద్దు చేయాలని, నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) బుధవారం నుంచి కృష్ణా జలాల పరిరక్షణ యాత్రకు సిద్ధమైంది. టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఆరు రోజుల పాటు 150 కిలోమీటర్ల యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది.   

ఇదీ యాత్ర షెడ్యూల్‌.. 
♦4వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉదయ సముద్రం పానగల్‌ వద్ద యాత్ర ప్రారంభం. సా యంత్రం 6–30 గంటలకు నల్లగొండ పట్టణం లోని గడియారం సెంటర్‌లో బహిరంగ సభ  
♦5న ఆర్జాలబావి, చర్లపల్లి, ఎంజీ వర్సిటీ, ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు మీదుగా నార్కట్‌పల్లి వరకు కొనసాగింపు. 
♦6 నార్కట్‌ పల్లి నుంచి ఏనుగులదోరి, గోపలాయపల్లి, వట్టిమర్తి స్టేజీ, చిట్యాల మార్కెట్, నేరడ, చౌడంపల్లి, బ్రాహ్మణవెల్లెంల వరకు కొనసాగుతుంది. 
♦7న బ్రాహ్మణ వెల్లెం నుంచి ఎలికట్టె, రత్తిపల్లి, సింగారం, మునుగోడు, బోడంగిపర్తి, కొండాపురం, కమ్మగూడెం, తేరట్‌పల్లి, గట్టుప్పల్‌ వరకు కొనసాగుతుంది. 
♦8న గట్టుప్పల్‌ నుంచి చర్లగూడెం, మర్రిగూడెం సెంటర్, ఈదులకుంట, కృష్ణరాంపల్లి, వింజమూరు, చింతపల్లి, మల్లేపల్లి, దేవరకొండ వరకు కొనసాగుతుంది. 
♦9న దేవరకొండలో యాత్ర ప్రారంభం. నక్కలగండి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు చేరుకుంటారు. అక్కడ యాత్ర ముగించి విలేకరులతో మాట్లాడతారు.  

మరిన్ని వార్తలు