వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌.. వీడియో వైరల్‌

2 Oct, 2021 14:16 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మికంగా వచ్చిన వరదకు వాగులో నుంచి వెళుతున్న ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం సర్పంచ్‌ తండా గ్రామ పంచాయతీకి చెందిన బట్టు రంపాల్‌ కొండాపూర్‌ గ్రామం నుంచి ట్రాక్టర్‌లో ఫ్రిజ్, కూల్‌ డ్రింక్స్‌ డబ్బాలు తీసుకుని వెళ్తుండగా మొండి వాగులో ట్రాక్టర్‌ దిగబడింది. అదే సమయంలో అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి భారీగా వరద వచ్చింది. ట్రాక్టర్‌ వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్‌ ట్రాక్టర్‌ దిగి ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పింది. 

మరిన్ని వార్తలు