17 వేల మెగావాట్ల సరఫరాకు సిద్ధం: ప్రభాకర్‌రావు 

16 Aug, 2022 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 17,000 మెగావాట్లకు పెరిగినా నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేందుకు సన్నద్ధతతో ఉన్నా మని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,333 మెగావాట్ల విద్యుత్‌ లభ్యత (కాంట్రాక్ట్‌డ్‌ కెపాసిటీ) ఉందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం విద్యుత్‌ సౌధలో ప్రభాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.  

మరిన్ని వార్తలు