విద్యుత్‌ పీఆర్సీకి సీఎం సానుకూలం

8 Jun, 2022 00:51 IST|Sakshi

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణకు సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారని, ఈసారి కూడా మంచి పీఆర్సీ ప్రకటిస్తా రని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంతటి ఆర్థిక సంక్షో భంలోనూ పీఆర్సీకి ముఖ్యమంత్రి అంగీకరించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజ నీర్స్‌ అసోసియేషన్‌ (టీఈఈఏ) ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్‌ సౌధలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు.

ఆర్థికపరమైన అంశాల్లోనే కాకుండా పనిలోనూ క్రమశిక్షణ పాటించాలని విద్యుత్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలతో పాటు తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందని తెలిపారు. వినియోగదారుల ఆగ్రహానికి గురికాకుండా నాణ్యమైన సేవలందిం చాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి విద్యుత్‌ ఉద్యోగులకు సూచించారు. రూ.35 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని, ఇంత ఖర్చు చేసినా వినియోగదారుల మన్ననలను చూర గొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు