విగ్గుగాళ్లు, పెగ్గుగాళ్లు రాహుల్‌ గురించి మాట్లాడతారా?

11 May, 2022 01:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ వరంగల్‌ సభ తర్వాత రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుడుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ వ్యా ఖ్యానించారు. రాహుల్‌ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రజల కు అర్థమయిందని, తెలంగాణ సమాజం మేల్కొందని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత టీఆర్‌ఎస్, కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.

కేసీఆర్‌ అంటేనే మోసం, దగా అని ఆరో పించిన మధుయాష్కీ విగ్గుగాళ్లు, పెగ్గుగాళ్లకు రాహుల్‌ గురించి వి మర్శించే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఇవ్వక పోతే టీఆర్‌ఎస్‌ నేతలు మొజంజాహి మార్కె ట్‌లో గులాబీపూలు అమ్ముకునే వారని ఎద్దేవా చేశారు.   

మరిన్ని వార్తలు