TS Eamcet 2022 Results: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

12 Aug, 2022 12:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు. 

➤ టీఎస్ ఎంసెట్‌-2022 (ఇంజనీరింగ్‌) ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి 

➤ టీఎస్ ఎంసెట్‌-2022 (అగ్రికల్చర్) ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

➤ టీఎస్ ఈసెట్-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

ఇంజనీరింగ్‌:
ఫస్ట్‌ ర్యాంక్‌-లక్ష్మీసాయి లోహిత్‌
సెకండ్‌ ర్యాంక్‌- సాయిదీపిక
థర్డ్‌ ర్యాంక్‌- కార్తికేయ

అగ్రికల్చర్‌:
ఫస్ట్‌ ర్యాంక్‌- నేహ
సెకండ్‌ ర్యాంక్‌-రోహిత్‌
థర్డ్‌ ర్యాంక్‌-తరుణకుమార్‌

గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం, 30, 31 తేదీల్లో అగ్రి, మెడికల్‌ ఎంసెట్‌ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి 1.52 లక్షలమంది, అగ్రి ఎంసెట్‌కు 80 వేలమంది హాజ­రయ్యారు. ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాల కోసం www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వొచ్చు.   

మరిన్ని వార్తలు