సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం

31 Jan, 2023 02:03 IST|Sakshi
ఎన్‌వీకే శ్రీనివాస్‌, జి.వెంకటేశ్వరరెడ్డి 

సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థలో రెండు డైరెక్టర్‌ పోస్టుల నియామక ప్రక్రియ సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో జరిగింది.  పోటీ పడుతున్న వారి వివరాలను పరిగణనలోకి తీసుకున్నాక ఇద్దరి ని ఎంపిక చేశారు.

మణుగూరు ఏరియా జీఎం జి.వెంకటేశ్వరరెడ్డిని డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌గా, ఆండ్రియాల ప్రాజెక్ట్‌ జీఎం ఎన్‌వీకే శ్రీనివాస్‌ను డైరెక్టర్‌(ఆపరేషన్స్‌)గా నియ మిస్తూ సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి పదవీకాలం రెండేళ్లు. కాగా, సింగరేణిలో డైరెక్టర్‌(పా) పోస్టు ఖాళీగానే ఉంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు