వీహెచ్‌పీ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్‌.. ఈస్ట్‌జోన్‌ డీసీపీకి ఫిర్యాదు

30 Aug, 2022 01:22 IST|Sakshi
డీసీపీకి ఫిర్యాదు చేస్తున్న బాలస్వామి 

సుల్తాన్‌బజార్‌: విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నేత బాలస్వామికి ఆదివారం బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆయన ఈస్ట్‌జోన్‌ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మా ట్లాడుతూ బజరంగ్‌దళ్‌ నిరసన కార్యక్రమాలను నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్‌ ప్రచార ప్రముఖ్‌ అయిన తనకు ఆదివారం అర్ధరాత్రి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని తెలిపారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇవ్వడంతో పాటు డీసీపీలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేయడాన్ని వారు సవాలు చేస్తున్నారన్నారు. రకరకాల పేర్లతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను వెంటనే రద్దుచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చ రించినట్లు బాలస్వామి వెల్లడించారు. వీహెచ్‌పీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను కొందరు మార్పిడి చేసి వైరల్‌ చేశారన్నారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు జోడించారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై డీసీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. 

మరిన్ని వార్తలు