తెలంగాణ: ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక! వర్ష ప్రభావం ఇంకెన్ని రోజులంటే..

15 Oct, 2022 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంపై వర్ష ప్రభావం.. మరో వారంపాటు ఉండొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు..(శని, ఆది వారాల్లో) ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని  హెచ్చరించింది. 

తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. 

ఈ నెల 18న ఉత్తర అండమాన్‌, దాని పరిసరాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినప్పటికీ.. ఉదయం లేదా సాయంత్రం పూట చిరుజల్లులు కురిసే అవకాశం ఉండొచ్చని తెలిపింది.

ఇదీ చదవండి: ఏపీకి పొంచి ఉన్న తుపాను గండం!

మరిన్ని వార్తలు