టాటూ ట్రెండింగ్‌.. క్యూ కడుతున్న యువత !

5 Jun, 2022 19:20 IST|Sakshi

సాక్షి,నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రస్తుత కాలంలో టాటూ.. ట్రెండ్‌ గా మారింది. నాటి పచ్చబొట్టే.. నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరంపై టాటూ డిజైన్‌ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు వ్యక్తుల ఫొటోలను టాటూగా వేసుకుంటున్నారు. కొందరు స్టైల్‌ కోసం.. మరికొందరు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్, డిఫరెంట్‌ వెరైటీస్‌తో లవర్స్‌ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం కలర్‌ టాటూస్‌ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్‌ కలర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకొని మురిసిపోతున్నారు యువత.

యూత్‌ ఫ్యాషన్‌గా.. 
టాటూ ఒక  ఫ్యాషన్‌గా మారింది. ప్రతిఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, దేవతల ఫొటోలను  టాటూగా వేసుకోవడం ట్రెండ్‌గా మారింది. 

మనసుకు నచ్చినట్టుగా.. 
గతంలో కేవలం గ్రీన్‌ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్‌ వెరైటీస్‌తో వేస్తున్నారు. వివిధ రకాలతో యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. మల్టీకలర్స్‌తో లైఫ్‌ లాంగ్‌ గుర్తుండేలా వేసుకోవడం ప్రస్తుత రోజుల్లో  క్రేజ్‌గా మారింది.

వెలిసిన సెంటర్లు..
గతంలో కేవలం నగరాలకే పరిమితమైన టాటూ కల్చర్‌ ప్రస్తుతం చిన్నపట్టణాలను సైతం విస్తరించింది. గతంలో జాతర్లలో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పచ్చబొట్టు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం టాటూలు వేసేందుకు ప్రత్యేక సెంటర్లు వెలిశాయి.

క్రేజ్‌ పెరిగింది..
నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం నేటి యువత టాటూలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం యువతకు టాటులపై క్రేజ్‌ పెరిగింది. 
– సంతోష్‌ వర్మ, టాటూ కళాకారుడు 

ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం
ఫ్యాషన్‌గా ఉండడం ఇష్టం. అందుకు తగ్గట్టుగానే నేను టాటూ వేయించుకున్నాను. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే టాటూ సెంటర్‌ అందుబాటులో ఉండడంతో యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 
– దరందాస్‌ సాయి, నిర్మల్‌

మరిన్ని వార్తలు