జనగణనలో కులగణన చేపట్టాలి: ఆర్‌.కృష్ణయ్య

5 Nov, 2022 02:43 IST|Sakshi

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో వైఎస్సార్‌సీపీ ఎంపీ భేటీ 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ కులాల జనాభా లెక్కల వివరాలు లేకపోవ­డంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతు­న్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు శుక్రవారం కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలో కిషన్‌­రెడ్డిని  జాతీ­య బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగి­రేకుల వరప్రసాద్‌ యాదవ్, బీసీ నేతలు మెట్ట చంద్రశేఖర్, మోక్షిత్‌ తదితరులు కలిసి చర్చలు జరి­పారు. బీసీలకు సంబంధించిన 15 ప్రధాన సమస్యలను వివరించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటు­లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు.

బీసీ ఉద్యోగులకు ప్ర­మో­­న్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో  16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని  స్పష్టం చేసినట్టు  కృష్ణయ్య తెలిపారు. 

మరిన్ని వార్తలు