Traffic Challan: చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన.. నిమిషానికి 1000.. ఎంత వసూలైందంటే?

17 Mar, 2022 09:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ– చలాన్‌ జరిమానా బకాయిలు భారీ తగ్గించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న ఈ– లోక్‌ అదాలత్‌కు వాహన చోదకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోలీసులు పెట్టిన వన్‌టైమ్‌ డిస్కౌంట్ ఆఫర్లకు భారీగా స్పందన లభిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభమైన ఈ విధానంలో మంగళవారం వరకు 1.29 కోట్ల చలాన్లు చెల్లించారు. 15 రోజుల వ్యవధిలో చలాన్ల రూపంలో రూ.132 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. వీటిలో 80 శాతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 56 లక్షల చలాన్లకు సంబంధించి రూ.43 కోట్లు వసూలయ్యాయి.
చదవండి:హైదరాబాద్‌: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక!

మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ ఉండనుంది. నిమిషానికి వాహనాదారులు 1000 చలాన్‌లు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజేజే 5.5 కోట్ల రూపాయలు ఫైన్‌లుచెల్లించారు. డిసెంబర్ 2021 వరకు 80 లక్షల పెండింగ్ చలాన్ లు ఈ–చలాన్‌ చెల్లింపుల కోసం ఉద్దేశించిన అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులు చేశారు. తొలినాళ్లల్లో అక్కడ వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో పాటు ఇంజన్‌ లేదా చాసిస్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం కచ్చితం చేశారు. అప్పుడే పెండింగ్‌ చలాన్లు కనిపించేవి. అయితే తాజాగా చేసిన మార్పులతో కేవలం వాహనం నంబర్‌తోనే ఎంటర్‌ కావచ్చు.

ఫోన్‌ నంబర్‌ పొందుపరిచి, దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయడం మాత్రం తప్పనిసరి. ఈ–లోక్‌ అదాలత్‌ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జారీ అయిన ఈ–చలాన్లకు మాత్రమే ఈ రిబేటు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చలాన్లకు మాత్రం మొత్తం చెల్లించాల్సిందేనని వివరిస్తున్నారు. 
చదవండి: అలా చేస్తే కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్‌

మరిన్ని వార్తలు