యాదాద్రి ఆలయ పునఃప్రారంభ తేదీని ప్రకటించిన సీఎం కేసీఆర్‌

19 Oct, 2021 19:25 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ముహూర్త తేదీని సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. యాదాద్రిలో 2022 మార్చి 28న మహాకుంభ సం‍ప్రోక్షణ ప్రారంభమవుతుందని కేసీఆర్‌ తెలిపారు. తొమ్మిది రోజుల ముందు మహా సుదర్శన యాగంతో అంకురార్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ సభ ఈ తేదీలను నిర్ణయించిందన్నారు. ఆ సమయాల్లో లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అన్నారు.  సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనలో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షణలో మహా సుదర్శన యాగం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: యాదాద్రి ల‌క్ష్మిన‌రసింహ స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్

యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో మహా తెలంగాణలో గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విశిష్ట పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటని కొనియాడారు. జోగులాంబ ఆలయం గొప్ప శక్తిపీఠమని, కృష్ణా పుష్కారాలను జోగులాంబ ఆలయం వద్ద ప్రారంభించానని తెలిపారు. స్వామి వారి విమాన గోపురాన్ని స్వర్ణతాపడం చేయించబోతున్నామని, ఇందుకు 125 కిలోల బంగారం అవసరమన్నారు. ప్రతి గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామన్నారు. తెలంగాణలో 12 వేల 769 గ్రామ పంచాయితీలు ఉన్నాయని, ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇస్తే రిజర్వ్‌ బ్యాంక్‌ నుంంచి బంగారం కొంటామని అన్నారు.  గ్రామం నుంచి 16 రుపాయలు ఇచ్చినా సరిపోతుందన్నారు. 

తమ కుటుంబం నుంచి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంత్రి మాల్లారెడ్డి కుటుంబం నుంచి కేజీ, మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి కేజీ ఇస్తామన్నట్లు సీఎం పేర్కొన్నారు. నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కేజీల బంగారం ఇస్తామన్నారని తెలిపారు. భాస్కరరావు కావేరి సీడ్స్‌ తరపున కేజీ బంగారం, జీయర్‌ పీఠం నుంచి కూడా కేజీ బంగారం ఇస్తామన్నారని పేర్కొన్నారు.

‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైంది. సామాజిక వివక్షే కాకుండా.. ఆధ్యాత్మిక వివక్షకు గురైంది. ఒకప్పుడు పుష్కరాలు కూడా నిర్వహించేవారు కారు. ఉద్యమ సమయంలో నేను ప్రశ్నిస్తే పుష్కరఘాట్లు నిర్మించారు. 50 ఏళ్ల కిందటే యాదాద్రి వచ్చాను. 1969లో తిరుమల వెళ్లాను. యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. వసతి సదుపాయం కోసం టెంపుల్‌ సిటీని అభివృద్ధి చేశాం. టెంపుల్‌ సిటీలో అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు చేపట్టాం. 100 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చక్కగా జరిగింది.’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు