44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు 

24 Mar, 2023 03:52 IST|Sakshi

నాంపల్లి: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో విశేషమైన సేవలందించిన 44 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీ ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది.  

పురస్కారాల విజేతలు వీరే... 
డాక్టర్‌ సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు(ఆధ్యాత్మిక సాహిత్యం), పుత్తా పుల్లారెడ్డి(ప్రాచీన సాహిత్యం), డాక్టర్‌ వి.వి.రామారావు (సృజనాత్మక సాహిత్యం), టి.వి. ప్రసాద్‌ (కాల్పనిక సాహిత్యం), వారాల ఆనంద్‌ (అనువాద సాహిత్యం), ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి(బాల సాహిత్యం), డాక్టర్‌ ఎ.వి.వీరభద్రాచారి(వచన కవిత), కొరుప్రోలు మాధవరావు(తెలుగు గజల్‌), జి.వి.కృష్ణమూర్తి(పద్యరచన), డాక్టర్‌ మాదిరాజు బ్రహ్మానందరావు(పద్యరచన), డాక్టర్‌ పసునూరి రవీందర్‌(కథ), వేముల ప్రభాకర్‌(నవల), ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు (హాస్య రచన), జి.భగీరథ(జీవిత చరిత్ర), తాళ్లపల్లి మురళీధరగౌడ్‌(వివిధ ప్రక్రియలు), చిలువేరు రఘురాం(నాటక రచయిత), డాక్టర్‌ వి.వి.వెంకటరమణ(జనరంజక విజ్ఞానం), ఎస్‌.వి.రామారావు (పరి­శోధన), అన్నవరపు బ్రహ్మయ్య(పత్రికారచన), రాళ్లపల్లి సుందర్‌రావు(భాష), ఘట్టమరాజు అశ్వ­త్థామనారాయణ(సాహిత్య విమర్శ), కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి(అవధానం), పి.వి.సాయిబాబ (లలిత సంగీతం), డాక్టర్‌ కె.శేషులత(శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు), ఎం.డి.రజియా(జాన­పద కళారంగం), పస్తం కొమురమ్మ(జానపద కళలు), డాక్టర్‌ పొనుగోటి సరస్వతి(ఉత్తమ రచయి­త్రి), శైలజామిత్ర(ఉత్తమ రచయిత్రి), నాగమణి(ఉత్తమనటి), మాలెల అంజిలయ్య(ఉత్తమ నటుడు) ప్రొఫెసర్‌ భాస్కర్‌ శివాల్కర్‌ (నాటక రంగంలో కృషి), పేరిణి ప్రకాశ్‌(పేరిణి), డాక్టర్‌ రుద్ర­వరం సుధాకర్‌(కూచిపూడి నృత్యం), డాక్టర్‌ గెల్లి నాగేశ్వరరావు(సంఘసేవ), పేరలింగం(హేతువా­ద ప్రచారం), బండారు విజయ(మహిళాభ్యుద­యం), డాక్టర్‌ ముదిగంటి సుధాకర్‌రెడ్డి (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), ప్రొఫెసర్‌ గజ్జల రామేశ్వరం(గ్రంథాలయకర్త), ఆకృతి సుధాకర్‌(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), శ్యామ్‌ (ఇంద్రజలం), నారు (కార్టూనిస్ట్‌), డాక్టర్‌ ఎ.ఎస్‌.ఫణీంద్ర (జ్యోతిషం), ఎజాజ్‌ అహ్మద్‌ (ఉత్తమ ఉపాధ్యాయుడు), ప్రొఫె­సర్‌ ప్రీతి సంయుక్త(చిత్రలేఖనం) తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు.

ఈ నెల 28, 29వ తేదీలలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్  ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రూ.5,116 న­గ­దు, పురస్కారపత్రంతో సత్కరిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్  ఆచార్య భట్టు రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.   

మరిన్ని వార్తలు