తగ్గేదేలే.. 20లోపు జీవో రాకపోతే ఉద్యమం ఉధృతం: వీఆర్‌ఏలు

13 Sep, 2022 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వీఆర్‌ఏలు అన్నారు. మంత్రిపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆందోళన విరమించాలన్న కేటీఆర్‌ ప్రతిపాదనలపై చర్చిస్తున్నామని వీఆర్‌ఏ నేతలు పేర్కొన్నారు. ఈ నెల 20లోపు జీవో రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఆందోళన చేపట్టిన వీఆర్‌ఏ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వీఆర్‌ఏల సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అంతవరకు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 20న వీఆర్‌ఏలతో మళ్లీ చర్చలు జరుపుతామని కేటీఆర్‌ వెల్లడించారు.
చదవండి: వీఆర్‌ఏల ఆందోళన.. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ మరో ఫెయిల్యూర్‌ 

మరిన్ని వార్తలు