ఇది ‘పది’ చోరీల కథ.. చివరికి ప్రిన్సిపాల్‌ ఇంటిమందున్న వాహనాన్ని కూడా

1 Sep, 2022 11:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌: దొంగతనాలు జరిగాయంటే దాని వెనుకాల వయస్సును బట్టి పరిస్థితులు ఉంటాయి. అందులోనూ పదోతరగతి విద్యార్థులు పలు చోరీలకు పాల్పడ్డారంటే.. అందరూ ఉలిక్కిపడే పరిస్థితి.. నర్సంపేట నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పదిమంది పదో తరగతి విద్యార్థులు చోరీలకు పాల్పడుతూ కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.

విశ్వసనీయ వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులు ఆ విద్యాసంస్థలోని హాస్టల్‌లో ఉంటున్నారు. డబ్బుల కోసం.. హాస్టల్‌ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ప్రహరీ దూకి వైన్‌షాపుల్లో, ఇళ్ల ముందు ఉన్న వాహనాలను, పెట్రోల్‌ బంకుల్లో ఉన్న వస్తువులను చోరీ చేస్తున్నారు.

చివరికి పాఠశాల ప్రిన్సిపాల్‌ ఇంటిముందు ఉన్న వాహనాన్ని కూడా దొంగిలించారు. గమనించిన పాఠశాల యాజమాన్యం నర్సంపేట పోలీసులకు తెలియజేసింది. ఎస్‌హెచ్‌ఓ పాఠశాలను మంగళవారం సందర్శించి ఆరా తీశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిని రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.  
చదవండి: గణేష్‌ ఉత్సవాలు షురూ.. ఈ  జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి!  

మరిన్ని వార్తలు