ఆ.. ఇల్లే ఒక ‘బృందా’వనం

3 Nov, 2021 21:12 IST|Sakshi

ఇంటినే ఉద్యాన వనంగా మార్చిన మహిళ

పూల కుండీలు, కూరగాయాల పెంపకం

భవనంపైనే గ్రీన్‌ సెట్‌ పర్మినెంట్‌గా ఏర్పాటు

మిర్యాలగూడ టౌన్‌: ఇంట్లో కొద్దిపాటి స్థలం ఉంటే చాలు..ఓ గది కట్టేద్దాం అనుకుంటాం. కానీ ఆ మహిళ తన ఇంటినే ఓ ఉద్యానవనంగా మార్చేసింది. తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి స్థలంలో పలు ఉద్యాన పంటలు వేశారు. పూల కుండీల్లో వివిధ రకాల మొక్కలు, కూరగాయాల మొక్కలను సాగు చేస్తూ అందరికి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. తన ఇంటిపైన వివిధ రకాల పూలు, కురగాయాలు, ఆకు కూరలు, పండ్లు పండిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాది ఓ మహిళ.

ఎప్పుడు వంటింటిలో బీజీబీజీగా ఉండే ఈ మహిళకు మొక్కలు అంటే ఎంతో ప్రాణం. ఒక వైపు కుటుంబం కోసం మరో రెండు గంటల పాటు తన ఇంటిపై ఏర్పాటు చేపిన వనంపై సమయం కేటాయిస్తుంది పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో నివాసం ఉంటున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ గోవర్ధనాచారి సతీమణి పద్మాగోవర్ధనాచారి గత కొంత కాలంగా  సాంప్రదాయ ఎరువులను ఉపయోగించి మంచిదిగు సాగును చేస్తుంది.  

బృందావనంలా మారిన ఇల్లు: 
హనుమాన్‌పేటలో నివాసం ఉండే పయిడిమర్రి పద్మాగోవర్ధనాచారి ఇంటిపై అడుగుపెడితే చాలు అది ఒక బృందావనవనంగా ఉంటుంది. పచ్చదనం అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. తన ఇంటి స్లాబ్‌పై వివిధ రకాల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయాలు, పండ్ల మొక్కలు, రసాయన రహితంగా సహాసిద్దమైన పద్దతిలో పెంచుతుంది. అయితే ఏ జాతి మొక్కలకు ఎంత నీరు అవసరం, ఎంత వరకు సూర్యరష్మిపెరుగుతుంది.

ఏ మొక్కకు ఎంత ఉష్ణోగ్రత ఉంటే తట్టుకుంది. ఎలా పండిస్తే భూసారం పెరుగుతుందనే విషయంపై తన భర్త సలహాలు, సూచనలు తీసుకుంటుంది. తన ఇంటి మూడవ ఆంతస్తుపై పర్మినెంట్‌గా గ్రీన్‌ సేట్‌ను ఇనుప సువ్వలతో తయారు చేసి పర్మినెంట్‌గా ఏర్పాటు చేసింది. కాగా ఐదారు డ్రమ్‌లు, 15 వరకు కుండీలు, బకెట్లలో రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టితో స్లాబ్‌ మీమ్‌లపై డ్రమ్ములు పెట్టి వివిధ రకాల మొక్కలతో పాటు ఆకుకూరలను వేసింది.  

వివిధ రకాల పంటలు:
పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి తన ఇంటిపైన పందిరి వేయడంతో పాటు వివిధ కుండీలలో పూల మొక్కలు గులాబి, మల్లే, చామంతి, మందారం, లిల్లి, పారిజాతం, నూరు వరాల చెట్టులతో పాటు పలు రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. అదే విధంగా ఆకు కూరలు అయిన పాలకూర, బచ్చలకూర, మోంతుకూరలను పెంచుతున్నారు. తీగ పాదులకు పందిరి వేసి బీర, సోర, కాకర, దొండ, చిక్కుడు, దోసకాయలను పందిరిపైకి ఎక్కించాడు.

అదే విధంగా కూండీలలో వంగ, టమాట, మిర్చి, బెండ, కోతిమీర, పూదీనా, కరివేపాక, మిర్చి వంటివి పండిస్తున్నాడు. అదే విధంగా జామ, ద్రాక్షతో పాటు మరిన్ని పంటలను ఇంటిపై పెంచుతూ పలువురిని ఆకట్టుకుంటున్నారు. వీటికి డ్రిఫ్‌తో ఖాళీ బాటిళ్లు, క్యాన్ల ద్వారా నీటి పోస్తున్నారు. 

మొక్కలతో ఎంతో ఆరోగ్యం
తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో గ్రీన్‌ సెట్‌ను ఏర్పాటు చేసి ఈ మొక్కలకు ఎంత సూర్యరశ్మి అవసరం ఉంటుంది అనే దానిపై ఏర్పాటు చేశాం. ఇంటి మేడపై పూల మొక్కలు, కూరగాయాలతో పాటు వివిధ రకాల పండ్లను పెంచుతున్నాం. గత రెండేళ్లుగా తన ఇంటిపై పండిన కూరగాయాలు, పువ్వులను కూడా వాడుతున్నాం. అదే విధంగా పండ్లు కూడా మేము వేసిన చెట్టు ద్వారా  వచ్చే పండ్లు, కూరగాయాలు తీనడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన కూరగాయాలను తీçనవచ్చు. దీని వలన ఒక వైపు పచ్చదనం, మరో వైపు మన ఇంటి అవసరాలు కూడా వెళ్లుతున్నాయి. – పగిడిమర్రి పద్మగోవర్ధనాచారి, మిర్యాలగూడ

మరిన్ని వార్తలు