ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు సహకరిస్తున్నాం: అమెరికాలోని ఇండియన్‌ కాన్సులేట్‌

10 May, 2023 08:37 IST|Sakshi

టెక్సాస్‌ అలెన్‌ ప్రీమియం ఔట్‌లెట్‌ మాల్‌లో దుండగుడి కాల్పుల్లో మృతిచెందిన తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య(26) మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఆమె కుటుంబానికి సహకరిస్తున్నామని అమెరికాలోని ఇండియన్‌ కాన్సులేట్‌ తెలియజేసింది. శనివారం టెక్సాస్‌ మాల్‌ కాల్పుల్లో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఐశ్వర్య మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడానికి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయడానికి తమ వంతు సాయం అందిస్తున్నామని హూస్టన్‌లోని కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అసీమ్‌ మహాజన్‌ చెప్పారు. కాల్పుల్లో ఐశ్వర్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య పార్థివ దేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతినిధి అశోక్‌ కోళ్ల కృషి చేస్తున్నారు.
చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి

మరిన్ని వార్తలు