నిమ్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. డాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం

26 Feb, 2023 22:53 IST|Sakshi

వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స అందించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి 9.10 గంటలకు ఆమె తుదిశ్వస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 

నిమ్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ప్రీతికి చికిత్స అందించిన నిమ్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వైద్యులు నిర్లక్ష‍్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఆమె మృతి చెందిన విషయాన్ని చెప‍్పేందుకు తల్లిదండ్రులను ఐసీయూలోకి రావాలని వైద్యులు సూచించారు. కానీ ప్రీతి ఎలా చనిపోయిందన్న విషయాన్ని చెప్పాలని అభ్యర్థించారు.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తేల్లి చెప్పారు ఆమె తల్లిదండ్రులు. హెచ్‌వోడిపై కేసు నమోదు చేయాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తనని లోపలికి అనుమతించడం లేదని ప్రీతి సోదరుడు వాపోయారు. ఐసీయూ వద్ద ప్రీతి తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది. అయితే కాసేపట్లో ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రీతి మరణవార్త విన్న తెలియడంతో ఆమె గ్రామంలో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. 

ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వపరంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్ట చేశారు. 
 

మరిన్ని వార్తలు