మసకబారుతున్న చారిత్రక గురుతులు

10 Sep, 2020 10:33 IST|Sakshi
గుట్టపై వెలిసిన జల్లి దేవుడు

సాక్షి, ఖమ్మం: ఘన చరిత్ర కలిగిన జిల్లాలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో గుట్టపై కాకతీయుల కాలంలో కోట నిర్మించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు దాడి చేసి కోటను స్వాధీనం చేసుకున్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలు వారంరోజుల పాటు ఇక్కడ నిర్వహించారు. గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అధికారులు ప్రకటించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాగా కోటలో బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ కొందరు తవ్వకాలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లావాసులు కోరుతున్నారు. 
 

మరిన్ని వార్తలు