బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి.. వారి పేర్లు బయటకు చెప్పలేను: చికోటీ ప్రవీణ్‌ ఆవేదన

17 Aug, 2022 13:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో చికోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహరం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్‌పై ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేయలేదు. క్యాసినో లీగల్‌గానే చేశాను.

ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. రాజకీయ స్వార్థం కోసమే నా భుజంపై తుపాకీ పెట్టారు. విదేశాల నుంచి నాకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారు. మా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. నేను ఎలాంటి హవాలా వ్యాపారాలకు పాల్పడలేదు అని స్పష్టం చేశారు.

సినీ ప్రముఖుల ప్రమోషన్లకు చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయి. వీఐపీలు, వీవీఐపీలు క్యాసినోలకి వచ్చింది వాస్తవం. వారి పేర్లు చెప్పలేను. నాకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఈడీ ఎప్పుడూ పిలిచినా వెళ్తాను’’ అని వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: 40 ఏళ్ల పొలిటికల్‌ లైఫ్‌లో ఇలా ఎన్నడూ జరగలేదు.. మర్రి శశిధర్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు