ఆన్‌లైన్‌లో లాభాలంటూ మోసం: ముగ్గురిపై కేసు

8 May, 2021 16:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: ఆన్‌లైన్‌ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌కు చెందిన సీహెచ్‌. సురేష్‌ అనే వ్యాపారికి గతే డాది జూలై 30న సుధాకర్‌ అనే వ్యక్తి పరిచయమై, ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ అనే ఆన్‌లైన్‌ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇప్పిస్తానని చెప్పాడు.

దీంతో సురేష్‌ రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ డబ్బును ఓం ప్రకాశ్, శ్రీవాత్సవ్‌ అనే వ్యక్తులతో కలిసి సుధాకర్‌ డ్రా చేసుకున్నాడు. అయితే లాభాలు రాకపోగా ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.  సీసీఎస్‌ పోలీసుల ఆదేశాలతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ముగ్గురిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: మహిళ మెడలో చెప్పుల దండ వేసి.. గుండు కొట్టించి..)

మరిన్ని వార్తలు