పిడుగుపాటుకు ముగ్గురి మృతి 

4 Sep, 2021 01:21 IST|Sakshi

కౌటాల (సిర్పూర్‌): కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాతపడ్డారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన రైతు బోర్కుట్‌ పున్నయ్య(52), తల్లీకూతుళ్లు డొంగ్రీ పద్మ(40), డొంగ్రీ శ్వేత(20) తమ తమ పత్తి చేన్లలో ఎరువులు వేయడానికి వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. వర్షం వచ్చే అవకాశం ఉందని పద్మ భర్త హŸక్టు.. పద్మ, శ్వేతలను పున్నయ్య ఎడ్లబండిపై గ్రామానికి పంపాడు. పున్నయ్య, ఆయన భార్య రషిక, కుమారుడు బాలాజీ, పద్మ, శ్వేత ఎడ్లబండిపై బయల్దేరారు. అంతలోగానే ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగుపడింది. దీంతో పున్నయ్య, పద్మ, శ్వేత అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఎద్దు కూడా చనిపోయింది. రషిక, బాలాజీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు