సాగర్‌ కాల్వలో ముగ్గురి గల్లంతు.. బాలుడిని కాపాడే కంగారులో ఈత రాకున్నా..

20 Dec, 2021 10:54 IST|Sakshi
వివేక్‌ (ఫైల్‌), అభయ్‌ (ఫైల్‌) 

సాక్షి, ఖమ్మం: నగరంలోని సాగర్‌ ప్రధాన కాల్వ లో దానవాయిగూడెం వద్ద ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లోని అభయ్‌ ఆయుర్వేదిక్‌ ఆస్పత్రి శాఖల్లో పనిచేసే కేరళకు చెందిన ఏడుగురు వారాంతంలో భాగంగా ఖమ్మంలో కలుసుకున్నారు. సరదాగా సాగర్‌ కాల్వలో ఈతకు వెళ్లగా ముగ్గురు గల్లంతయ్యారు.

కోదాడ నుంచి వచ్చిన ప్రదీప్, షాజీ, సూర్యాపేట నుంచి వచ్చిన అభయ్‌ సంతోష్, ఖమ్మంలో ఉన్న పరకాల సోను, వివేక్, షిబ్బు తోపాటు, ఖమ్మం మేనేజర్‌ సోను కుమారుడైన 11 సంవత్సరాల బాలుడు షారోన్‌ కలిసి అదివారం సరదాగా ఈతకు వెళ్లారు. ప్రదీప్, షాజీ, షిబ్బులు ఈతకోసం కాల్వలో దిగారు. మిగిలినవారు ఒడ్డున కూర్చున్నారు. బాలుడు షారోన్‌ ప్రమాదవశాత్తు కాల్వలో జారి పడ్డాడు.

చదవండి: ('అమ్మ, నాన్నను కలపండి సారూ..’: శాన్విత)  

ఇది గమనించిన తండ్రి పరకాల సోను దూకగా..ఈత రాకున్నా కాపాడే కంగారులో వివేక్, అభయ్‌ సంతోష్‌లు కూడా కాల్వలోకి దూకారు. పిల్లాడిని ప్రదీప్‌ కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. తండ్రి సోనును ఈతరాని ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు. ఖానాపురం హవేలి ఎస్‌ఐ మౌలానా ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు